ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ డీఎస్పీ రమణకుమార్, SV గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి బాధ్యత లేకుండా పని చేసారని వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నా, వాళ్లు పని చేయలేదని చెప్పారు సీఎం చంద్రబాబు.
అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి సహా మరో అధికారిని వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు వెల్లడించారు. డీఎస్పీ అనాలోచితంగా ఆలోచించడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. తొక్కిసలాట ఘటన పై జ్యూడిషియల్ విచారణ జరపనున్నట్టు తెలిపారు. కొంత మంది అధికారులు వారికి అప్పగించిన టాస్క్ సరిగ్గా చేయలేదని తెలిపారు. తాను దేవుడి వద్దకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడిగానే వస్తానని తెలిపారు సీఎం చంద్రబాబు. అందరూ సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.