ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు : మంత్రి వేణు

-

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన  వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు కుటీల రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు జనసేన,  బీజేపీ టికెట్లు కూడా టీడీపీ నేతలకేే ఇస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఇంకా రూల్స్ తయారు చేయలేదు. అమరావతి పేరుతో అసైంన్డ్ భూములు లాక్కుంది చంద్రబాబు కాదా..? చంద్రబాబు తన బినామీలు బయటపడుతారని భయపడుతున్నారు.

ప్రజలను భయపెట్టి ల్యాండ్ గుంజుకున్నారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు తయారు కానప్పుడు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పించగలరా..? అని ప్రశ్నించారు. అబద్దాల పుట్టను బయటికీ తీసి.. రోజు మాట్లాడుతున్నారు చంద్రబాబు. వాలంటీర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ తీసేయాలన్నారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామన్నారు. ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version