తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులకు విద్యాశాఖ సిద్దమైంది. టెన్త్ పరీక్షల్లో ఛాయిస్ తగ్గించడం విధానాన్ని కట్టిన తరం చేయడం ఒకేరోజు సైన్స్ సబ్జెక్టు కు రెండు పేపర్ల నిర్వహణపై అభ్యంతరాలు రావడంతో విద్యాశాఖ స్పందించింది. వీటిపై అధికారులు సమాలోచనలు జరిపారు.
సూక్ష్మ ప్రశ్నలకు ఎక్కువ ఛాయిస్ ఇవ్వడం మరియు వ్యాస రూప ప్రశ్నలను సెక్షన్ విధానంలో ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే మార్పులను ప్రకటిస్తామని ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ తెలిపారు. కాగా, ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. అలాగే, తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది.