తెలుగు రాష్ట్రాలలో ఈరోజు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలో బోనాల పండుగ కారణంగా కిలో చికెన్ ధర రూ. 10 రూపాయల నుంచి 20 రూపాయలకు పైన పెరిగింది. హైదరాబాద్ మహానగరంలో రూ. 200 నుంచి 210, గుంటూరులో రూ. 180 నుంచి 200, విజయవాడలో రూ. 210 నుంచి 220 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో చికెన్ డిమాండ్ ను బట్టి ఇంతకన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. భారీగా చికెన్, మటన్ కొనుగోలు చేయడంతో ఎక్కువ ధరకు వీటిని అమ్ముతున్నారు. అంతేకాకుండా బోనాల పండుగ చివరి దశకు రావడంతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా ప్రజలు జరుపుకుంటారు.