బస్సులోనే భోజనం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఆకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ బస్సులోనే భోజనం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకొచ్చిన పులిహోర తిన్నారు. మిగతా మంత్రులు, ఐఏఎస్ అధికారులకు ఎర్రబెల్లి వడ్డించారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అవడిరంగాపురానికి బయలుదేరారు. అంతకుముందు మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను కేసీఆర్ పరిశీలించారు.
కాగా.. నష్టపోయిన వాటిల్లిన ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నష్టపోయిన పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రైతులు నిరాశకు గురికావొద్దు. సమస్యలు ఉన్నాయని చెప్పినా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వదు. కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనన్నారు.
Simplicity 🙏
బస్సులోనే భోజనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ pic.twitter.com/m4OOolKJPI
— BRS News (@BRSParty_News) March 23, 2023