నిరుద్యోగుల నిరసనకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు నిరుద్యోగులకు నిరసనలు చేయకూడదని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 నియామకాలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.