రైస్ మిల్లుల పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు..!

-

మహబూబాబాద్ జిల్లా లోని పలు రైస్ మిల్లుల పై రాష్ట్ర సివిల్ సప్లైస్ , టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 24 కోట్ల 55 లక్షల 33 వేల రూపాయల సి.ఎం.ఆర్ ధాన్యం ను  మాయం చేసిన 3 రు రైస్ మిల్లుల యజమానుల పై  క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఓ.ఎస్.డి ప్రభాకర్ మాట్లాడుతూ, ఖరీఫ్ , రబీ లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను కస్టం మిల్లింగ్ రైస్.. జిల్లా లోని పలు  మిల్లులకు కేటాయించగా, బియ్యం ను  అప్పజెప్పని మిల్లుల పై ఈ దాడులు నిర్వహిస్తున్నామని, ఈ దాడుల్లో విస్తుబోయే నిజాలు భయటపడుతున్నాయని, రైస్ మిల్లుల్లో సరిపోయే వరి ధాన్యం నిలువలు ఉండటం లేదని, ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లుల యజమానులపై రెవిన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే గాకుండా వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాన్నామని తెలిపారు.

ఈ టాస్క్ ఫోర్స్ దాడులు నిరంతరం కొనసాగిస్తామన్నారు. మహబూబాబాద్ పట్టణం లోని శ్రీనివాస ఇండస్ట్రీస్ రా, పారా బాయిల్డ్ రైస్ మిల్లులో  దాడులు కొనసాగిస్తున్నామని , ఇప్పటి వరకు 20 వేల క్వింటాళ్ల ధాన్యం గుర్తించామని , ఇంకా లెక్కింపు జరుగుతుందని లెక్కింపు పూర్తి అయినా తర్వాత పూర్తి వివరాలు వెల్లడి స్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version