తెలంగాణకు గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చింది – TPCC

-

తెలంగాణకు గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని TPCC చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్‌ పై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తెలుగు మహిళ అయిన నిర్మలా సీత రామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు..కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం అని ఫైర్‌ అయ్యారు.

mahesh-kumar-goud

తెలంగాణ కు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని… బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది. ఎన్నికల కోసమే బీహార్ కు నజరణాలు ఇచ్చారన్నారు. బీజేపీ తెలంగాణ పై వివక్ష చూపిస్తుంది… రాజకీయంగా తెలంగాణ ను దెబ్బతీయలని చూస్తుందని ఫైర్‌ అయ్యారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని తెలిపారు. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం తో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్ లో అందరికి సమానంగా ఇవ్వాలని తెలిపారు TPCC చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version