నేటితో ముగియనున్న స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు కార్యక్రమాలు

-

తెలంగాణ సర్కార్​ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా మధ్యాహ్నం జరగనున్న ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు ఆయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రారంభ వేడుకలను ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ పేరిట నిరుడు ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 8న హెచ్ఐసీసీ వేదికగా వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహం ఘనంగా జరిగింది.  ప్రతి రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఇటీవల ముగింపు వేడుకల్లో భాగంగా కూడా కోటి వృక్షార్చన పేరిట ఒకే రోజు కోటి 30 లక్షల మొక్కలు నాటారు. ఇవాళ జరగనున్న ముగింపు వేడుకలతో వజ్రోత్సవాలు సుసంపన్నం కానున్నాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version