మైనార్టీలను కాంగ్రెస్‌ ఎప్పుడూ ఓటు బ్యాంక్‌గానే చూసింది : కేసీఆర్

-

మైనార్టీలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంక్‌గానే చూసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 157 వైద్యకాళాశాలలు పెడితే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని కేంద్రంపై మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

“తెలంగాణ రాకముందు చాలా సమస్యలు ఉన్నాయి. సంక్షేమంతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. వందల రూపాయిలు ఉన్న పింఛన్‌ను వేల రూపాయిలకు తీసుకుపోయాం. రైతు చనిపోతే వారంలోలే బీమా వచ్చేలా చేస్తున్నాం. రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నాని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి. 24 గంటల కరెంట్ వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే అంటున్నారు. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరోకరికి చేయమంటే ఎలా? అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌గాంధీ అంటున్నారు. ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. ధరణి ఉండటం వల్లే రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయి. మూడేళ్లు ఆలోచించి ధరణి తెచ్చాం.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version