ఆ రాజకీయ నాయకుల గురించి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

-

ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుకుపోయిన రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదు.కనీసం అల్లా గురించి వారికి తెలియదు టోపీ పెట్టుకొని రాముడిని, సీతనే మొక్కుతున్నారు.మసీదుకు వచ్చి నమాజ్ చేస్తున్నారని ముస్లిం సమాజం వారికి ఓట్లు గుద్దుతున్నారు. తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా.. మీరే ఆలోచించుకోవాలి అన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ ఒక పాస్పోర్ట్ బ్రోకర్.. అలాంటి వ్యక్తిని అల్లాతో పోలుస్తారా..?

బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితయన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా? కేటీఆర్ చెప్పాలి. వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా..? దేవాలయాల్లో పూజలు చేసే సాధుసంతులు, పూజారులు బయటికి రావాల్సిన అవసరం ఉంది.ముస్లిం మత పెద్దల వలనే సాధుసంతులు బయటికి వచ్చి హిందువులను సంగతి చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు రాగానే కెసిఆర్ కు రామ జన్మభూమి గుర్తుకొస్తుంది. అవును నేను ధైర్యంగా చెప్తున్నా నేను కర సేవలో పాల్గొన్న. కేసీఆర్ అవసరం అనుకుంటే రామాయణాన్ని మార్చి అయోధ్యలో రాముడు పుట్టలేదని తిరిగి చరిత్ర రాస్తాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version