ఆ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ రోజు స‌మావేశం అయిన విషయం తెలిసిందే. ఈ కేబినెట్ లో సీఎం కేసీఆర్ ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా యాసంగి ధాన్యం మొత్తం కొనాలని కేబినెట్ నిర్ణయం తీసుకోగా.. ధాన్యం కొనుగోలుకు రూ. 3 వేల కోట్ల వ్యయం అంచనా వేసింది. అలాగే.. మెడికల్ ప్రొఫెసర్ల వయో పరిమితి 65కు పెంపునకు ఆమోదం తెలిపింది కేసీఆర్‌ కేబినేట్‌.

అలాగే.. మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించనున్నట్లు పేర్కొంది తెలంగాణ కేబినేట్‌. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలపగా.. జీవో 111 ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఆరు ప్రైవేట్ వర్సీటీలకు కేబినెట్ ఆమోదం తెలుపగా.. ఫార్మా, సివిల్ ఏవియేషన్ వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయో పరిమితి మూడేళ్లకు పెంచగా.. గ్రూప్‌1, 2 ఇంటర్వ్యూల రద్దునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్సిటీల్లో 3,500 నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version