దళితులకు షాక్.. దళిత బంధులో కోత పెట్టిన కేసీఆర్ సర్కార్ !

-

దళితులకు షాక్.. దళిత బంధులో కోత పెట్టనుంది కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న పద్దులో కీలక పథకాలను లక్ష్యంగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే, 2022-23లో దళిత బంధుకు రూ. 17 వేల కోట్లను కేటాయించగా, ఈ సారి కూడా అంతే మొత్తంలో నిధులు ఇవ్వనున్నట్లు తెలిసింది. అంటే ఈ లెక్కన దళిత బంధుకు నిధుల పరిమితిని పెంచడం లేదన్న మాట. దీంతో..లబ్ది దారుల సంఖ్య కూడా తగ్గే ఛాన్స్‌ ఉంది. రైతు బంధుకు రూ. 15 వేల కోట్ల మేర కేటాయింపులు ఉండనున్నాయి.

రైతు బీమాకు కేటాయింపులను వాస్తవిక ప్రాతిపాదికగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. రెండు పడకల గదుల ఇళ్లకు 2022-23లో రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఈసారి యథాతథంగా నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం. కేసీఆర్ కిట్ కు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version