శభాష్ కేసీఆర్: పీఎం స్థాయిలో ఆలోచిస్తున్న సీఎం!

-

చెప్పే విధానం కాస్త కటువుగా ఉన్నా… ప్రతీ కోణంలోనూ, అన్ని రంగాలనూ, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు, దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు అనే కీర్తి సంపాదించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సుమారు ఏడు గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశం అనంతరం ప్రజలముందుకు వచ్చిన కేసీఆర్… లాక్ డౌన్ పొడిగింపు.. రెడ్, ఆరెం, గ్రీన్ జోన్లలో సడలింపులు.. కంటైనెంట్ జోనల్లోని బిగింపుల గురించి జనాలను ఒప్పించేలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు! ఇటు వ్యాపారాల గురించి, అటు రైతుల గురించి, ఇటు ప్రజల గురించి, మరోపక్క వలస కూలీల గురించి, అటుపక్క రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి, ఇంకో పక్క విద్యార్థుల గురించి… ఇలా అన్ని కోణాల్లోనూ సుదీర్ఘంగా వివరణలు, క్లారిటీలు ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలల్లో… రాష్ట్రం మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 60 శాతం ఉన్నాయని వెళ్లడించిన కేసీఆర్… ఈ మూడు జిల్లాల విషయంలో ఏ స్థాయిలో స్ట్రిక్ట్ గా ఉండాలో ఆ స్థాయిలో ఉంటామని హెచ్చరించారు! ఇదే సమయంలో మిగిలిన అన్ని జోన్లకు చిన్న చిన్న కండిషన్స్ తో కూడిన మెజారిటీ సడలింపులు చేశారు. రూరల్‌ ఏరియాల్లో అన్ని రకాల షాపులు తెరుస్తామని.. అదే మున్సిపాలిటీల్లో ఫిఫ్టీ పర్సంట్‌ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని… అది కూడా లాటరీ తీసి ఈరోజు యాభైశాతం, రేపు యాభైశాతం చొప్పున షాపులు తీస్తారని.. ఈ షాపుల వద్ద భౌతికదూరం పాటించని పక్షంలో తెల్లారేసరికి షాపులు క్యాన్సిల్‌ చేస్తాం అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు!

ఈ సమయంలో ప్రధాన మంత్రి స్థాయిలో దేశవ్యాప్తంగా ఆహారంలో స్వావలంబనపై స్పందించారు కేసీఆర్! భారతదేశంలో ఉన్న సుమారు 130 కోట్ల మంది ప్రజలకు తిండిపెట్టే శక్తి ఏ దేశానికి లేదని గుర్తుచేసిన కేసీఆర్… తెలంగాణ కంటే చిన్నసైజులో ఉన్నవి చిన్నచిన్న దేశాలు వందకు పైచిలుకుంటాయి. వాటికి అంత శక్తి లేదని… కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఆహార రంగంలో మాత్రం దేశం సాధించుకున్న స్వావలంబనను కోల్పోవద్దని… అలా కానిపక్షంలో కరోనా కంటే పెద్ద ప్రమాదంలో పడతామని… అందుకు గానూ వ్యవసాయరంగ పనులు యథాతథంగా కొనసాగుతాయని సూచించారు కేసీఆర్! ఇందులో భాగంగానే వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, స్పేర్‌ పార్ట్స్‌ షాపులు ఎక్కడున్నా సరే అనుమతులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు!

ఇక భాగ్యనగరం విషయానికొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి… “హైదరాబాద్ చల్లగుండాలే” అంటూ మొదలుపెట్టి, జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపుగా కోటికిపైగా జనాభా ఉంటుందని… ఇక్కడే కమ్యూనిటీస్ప్రెడ్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన… ముంబైకి వచ్చిన దుస్థితి హైదరాబాద్ కు రావొద్దని కోరుకున్నారు. అందులో భాగంగా… ఉజ్వలమైన భవిష్యత్‌ ఉన్న రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు.

ఇక రైతుల విషయంలో ధాన్యం కలుగోలు వ్యవహారంపై కేసీఆర్ స్పందించారు. రైతుల ఊళ్లకే వెళ్లి… మద్దతు ధర ఇచ్చి ధాన్యం కనుగోలు చేస్తున్నామని… ఈస్థాయిలో ఆలోచించే రాష్ట్రాలు లేవని నొక్కి వక్కాణించారు. ఇదే క్రమంలో తాను బ్రతికున్నంతకాలం రైతుబంధు యథాతథంగా అమలవుతుందని ప్రకటించిన కేసీఆర్… వానాకాలం పంటకు కూడా రూ. 7వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇదే క్రమంలో… మతపరమైన సామూహిక ప్రార్థనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదని నొక్కి వక్కాణించిన కేసీఆర్… పెళ్లిళ్లకు 20 మందికి, దహన సంస్కారాలకు 10 మందికి మాత్రమే అనుమతి అని క్లారిటీ ఇచ్చారు!

ఇలా అన్ని రంగాలనూ దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి… సుమారు 7 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ కేబినేట్ సమావేశం అనంతరం ఈ వివరాలను ప్రకటించారు. దేశ ప్రధాని ఆలోచించేస్థాయిలో కేసీఆర్… తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆలోచించి… ఏదీ ఏదో సూచాయకగా మాట్లాడకుండా.. ప్రతీ దానికి గణాంకాలతో కూడిన అర్ధవంతమైన వివరణ ఇస్తూ… ప్రజలను నొప్పించక ఒప్పించే ప్రయత్నం చేశారని… ప్రజలను బలవంతంగా ఒప్పించేవాడు నాయకుడు కాదు… అర్ధమయ్యేలా చెప్పి మెప్పించే వాడే సిసలైన నాయకుడు అని కేసీఆర్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version