గన్‌మెన్‌కు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపిన CM KCR

-

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్య ప్రయత్నాన్ని అడ్డుకున్న గన్ మెన్ కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ప్రాణాలను కాపాడిన గన్ మెన్ కు ఆయన నమస్కరిస్తున్న ఫోటోను బీఆర్ఎస్ పార్టీలో పోస్ట్ చేసింది. కత్తి దాడిలో గాయపడిన ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

CM KCR saluted and thanked the gunmen

నిన్న సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇది ఇలా ఉండగా, ఎంపీ కొత్త ప్రభాకర్ పై కాంగ్రెస్ గూండాలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘నిరాశలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో మన నాయకులను భౌతికంగా నిర్మూలించే ప్రయత్నాలు చేస్తోంది. థర్డ్ గ్రేడ్ క్రిమినల్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఇలాంటివి ఊహించాం. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. దీనిపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version