తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీలో మంత్రివర్గ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. రైతు భరోసాకి ఆమోద ముద్ర వేయనున్నది కేబినెట్. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం సరఫరా పై చర్చ జరుగనుంది.
పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి విధి విధానాలను ఈ కేబినెట్ భేటీలో వెల్లడించనున్నది. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి కమిటీకి ఆమోదం తెలపనుంది. భూమి లేని పేదలకు జీవన భృతి వంటి విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాన్స్టీ టూషనల్ క్లబ్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. కొత్త మండలాలపై కూడా చర్చ జరుగుతోంది.