మ‌హోన్న‌త‌మైన విశ్వ‌మాన‌వ సౌధానికి శ్ర‌మ‌జీవుల త్యాగాలే పునాదిరాళ్లు : కేసీఆర్

-

కార్మికులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కార్మికుల దినోత్స‌వం శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్మిక‌, క‌ర్ష‌క సంక్షేమాభివృద్ధి ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోందని చెప్పారు. చెమ‌ట చుక్కల‌ను ధార‌పోసి ప‌రోక్షంగా స‌మాజాభివృద్ధికి కృషి చేస్తున్న అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హోన్న‌త‌మైన విశ్వ‌మాన‌వ సౌధానికి శ్ర‌మ‌జీవుల త్యాగాలే పునాదిరాళ్లు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కార్మికులు ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణిస్తే రూ. 6 ల‌క్ష‌లు ఆ కుటుంబానికి చెల్లిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. కార్మిక కుటుంబంలోని ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల పెండ్లికి రూ. 30 వేల చొప్పున వివాహ బ‌హుమ‌తి ఇస్తున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. 2014 నుంచి నేటి వ‌ర‌కు 46,638 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 130 కోట్లు చెల్లించాం అని సీఎం తెలిపారు. కార్మిక శ్రమ వల్లే ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతోందిని కేసీఆర్ ఉద్ఘాటించారు.

మ‌హిళా కార్మికుల‌కు 2 కాన్పుల వ‌ర‌కు రూ. 30 వేల చొప్పున ప్ర‌సూతి ప్ర‌యోజనాలు అందిస్తున్నాం. 2014 నుంచి నేటి వ‌ర‌కు 1,01,983 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 280 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version