రేపు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్..ప్రస్తుతం జిల్లాల పర్యటనతో ఫుల్‌ బిజీ అయ్యారు. ఇందులో భాగంగానే, రేపు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో తెలంగాణకు మాత్రమే సాధ్యమైందని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపట్టారని, అన్ని పనులు ఒకే చోట పూర్తయ్యే అవకాశం లభిస్తుందని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version