రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటన ఫిక్స్‌ అయింది. రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన కలెక్టర్ రెట్, ఎస్పీ కార్యాలయం , BRS పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.

అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో పాల్గొననున్నారు సిఎం కెసిఆర్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఎస్పీ మనోహర్. కాగా, ఇవాళ HYD శివారులోని కోకాపేటలో నిర్మించనున్న BRS ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ఆర్డి’ భవనానికి CM KCR ఇవాళ శంకుస్థాపన చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతుల నిర్వహణతో పాటు వారికి సమగ్రమైన సమాచారం లభించేలా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో భవనం ఉండనుంది. అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ సహా అత్యాధునిక హంగులతో కూడిన సదుపాయాలు కల్పించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version