ఓడిపోయినా.. ఆ నలుగురి ఘోషే వినిపిస్తోంది: రేవంత్‌రెడ్డి

-

ఓడిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబంలోని నలుగురి ఘోష మాత్రమే వినిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ సర్కార్ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. వివాదాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీని గత ప్రభుత్వం నిలిపివేసిందన్న రేవంత్.. తాము కోర్టు కేసులను పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సింగరేణిలో దశాబ్ద కాలంగా కారుణ్య నియామకాలు జరగలేదని చెప్పారు. సచివాలయంలో సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకం ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.

“బీఆర్ఎస్ నేతలు కట్టి కూల్చిన వాటిని ఎలా పునర్ నిర్మించాలో ఆలోచిస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. కేసీఆర్‌ కట్టి కూల్చిన వాటిని పునర్ నిర్మించడం గురించి ఆలోచిస్తున్నాం. కుంగిపోయిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చెప్పమంటే చెప్పట్లేదు. అన్నారం పగిలిపోయి ఉన్న నీళ్లు వృథాగా పోతున్నాయి. కుంగిన మేడిగడ్డ నుంచి పగిలిపోయిన అన్నారంలోకి నీళ్లు ఎత్తిపోయాలని హరీశ్‌రావు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలు తరలించుకుపోతుంటే పట్టించుకోలేదు. ఏపీ సీఎం జగన్‌కు విందు ఇచ్చి ఒప్పందాలు చేసుకుని కృష్ణా జలాలు ఇచ్చారు.” అని రేవంత్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version