14 స్థానాలు గెలవరని సవాల్ విసిరా.. సీఎం రేవంత్ స్పందించలేదు : మహేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14 స్థానాలు గెలుస్తామంటున్నారు. గెలువ లేరు అని నేను సవాల్ విసిరినా స్పందించడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు వచ్చుడు కష్టమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డిప్రెషన్ లో ఉండి మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఒక్కసీటు రాదు..కనీసం డిపాజిట్ సైతం రాదు. ఆవిషయం కేసిఆర్ కి కూడా తెలుసన్నారు. కాంగ్రెస్ మేము ఒక్కటి అనే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలవబోతుందని తెలిపారు.

బీఆర్ఎస్ లో కుటుంబ సభ్యులు తప్పా ఎవ్వరు మిలిగే పరిస్థితి లేదన్నారు. సీఎం 14 స్థానాలు గెలుస్తామంటున్నారు. గెల్వలేరు అని నేను సవాల్ విసిరినా స్పందించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు రేవంత్ ను నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కావాలని ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కోసం మాట్లాడుతున్నారని అన్నారు. అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలు అమలు చేశాం అన్నారు. ఏ ఒక్క హమీ అయినా నెరవేర్చితే నేను ముక్కునేలకు రాస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version