నేడు భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజబిజీగా ఉన్నారు. ఓవైపు రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ.. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. మొన్న కేరళ పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్న రేవంత్.. నిన్న కర్ణాటకలో పర్యటించారు. అక్కడ తెలుగు మాట్లాడే సరిహద్దు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వచ్చారు.

ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో పర్యటించనున్నారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్కు మద్దతుగా నేడు సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. భువనగిరిలో నిర్వహించనున్న రోడ్‌ షోలో పాల్గొననున్నారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి భువనగిరిలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పట్టణంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ ప్రచారం సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version