అంబేద్కర్ ఆశయ సాదన కోసం ప్రజా ప్రభుత్వం వేసిన అడుగులు అంటూ Xలో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలను నెరవేర్చమని వెల్లదించారు. విద్యా, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో బడుగు బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన చేశామని చెప్పారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని వెల్లడించారు.
రైతులు, రైతు కూలీలకు ఇందిరమ్మ భరోసాగా ఎకరాకు, ఏడాదికి రూ.12 వేల ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు స్పష్టం చేసారు. పేదల ఆరోగ్యం, ఆత్మగౌరవం కాపాడాలని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా “ఇందిరమ్మ ఇళ్లు” అన్నారు. రైతు, పేదలకు భూమి హక్కుపై భరోసా ఇస్తూ… “భూ భారతి”కి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.