ఎస్సీ వర్గీకరణ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ఎస్సీ వర్గీకరణ అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందించనుంది సబ్ కమిటీ.
ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఇందులో భాగం గానే సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన భేటీ కానుంది. కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం, సీతక్క, కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఇందులో పాల్గొననున్నారు.