కేంద్రంతో లొల్లి.. గవర్నర్ తో వివాదం మేం కోరుకోవడం లేదు : సీఎం రేవంత్

-

రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రతి నెల రూ.11 వేల కోట్లు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంతో చిల్లర తగాదాలతో పోకుండా ముందుకెళ్తున్నామని తెలిపారు. గవర్నర్‌ వ్యవస్థతో కూడా వివాదాలు కోరుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చినప్పటికి ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.64 వేల కోట్లుగా ఉందని వెల్లడించారు. సంక్షేమంతోనే అభివృద్ధిని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

‘దావోస్‌లో రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు కల్పిస్తాం. మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో. పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు కల్పిస్తాం. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. స్థూలంగా 8 లక్షల కోట్ల రుణభారం తెలంగాణపై ఉంది. మా ప్రభుత్వాన్ని ఎవరూ వేలెత్తి చూపించ లేరు. అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదలం.’ అని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీట్ ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version