మూసిపై అఖిలపక్షానికి రెడీ అని సీఎం రెఅవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నన్ను కలవడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైనా మూసి పైన అభిప్రాయాలు ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను చర్చ జరగకుండా అభివృద్ధి జరగదు నేను మూసి పై చర్చ జరగాలని కోరుకుంటున్నాను అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అఖిలపక్షానికి మీరు వస్తే కచ్చితంగా మూసి పైన అఖిలపక్షం పెడతాను. మూసిలో జీవించడానికి మూసి పక్కన ఉండడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. మూసిలో లగ్జరీ ఉంటుందా.. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు ఎందుకు అర్థం కావడం లేదు.. మూసి జనాలు మూసీలోనే ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు సీఎం.
అలాగే ఈటల రాజేందర్ మూసి పైన చేస్తున్న అభ్యంతరాలు నిర్మాణాత్మకంగా లేవు. అతనిపైన కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి ఉంది. ఇంకొన్ని నెలల్లో మూసికి సంబంధించిన డిజైన్లన్నీ రెడీ అవుతాయి. మూసి పునర్జీవం కోసం 1,50,000 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెడుతున్నారు అనేది నిజం కాదు. నిధులన్నీ ప్రైవేటు సంస్థలతోనే సమీకరించి వాళ్లతోనే ఖర్చు చేయించి మూసిని సుందరీ కరణ చేస్తాం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.