కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సవాల్ స్వీకరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేము డ్రగ్స్ టెస్ట్ కు రెడీ.. కాంగ్రెస్ వాళ్లు కూడా చేయించుకోవాలన్నారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అందరం డ్రగ్స్ టెస్ట్ కు వస్తాం.. వరల్డ్స్ టాప్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ టెస్ట్ చేద్దాం, అపాయింట్మెంట్ తీసుకోండి.
రాత్రి 8 గంటల వరకు మేము ఎప్పుడైనా వస్తాం.. మీడియా ముందే చేద్దాం రెడీ ఊరికే బురద పూస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటున్నారా తెలిపోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఏమేమి చేశారో చెబితే భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వరని పేర్కొన్నారు. తాను 2021 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. ఎవరెవరూ ఏమేమి చేసేవారో తనకు తెలుసు అన్నారు.