తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు కానున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు.
మారు వేషాల్లో మారీచుడు, సుబాహువుల్లా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ వద్దకు వస్తారని.. వారు చెప్పేవి నమ్మకండి, వినకండి అని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ వేసాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో వరి వేసుకుంటే ఉరే అని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఆ పరిస్థితి నుంచి వరి వేసు కుంటే.. అందులో సన్నాలు వేసిన వారికి 500 రూపాయల బోనస్ ఇచ్చాము. ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఇచ్చాము. ఎవరు వచ్చినా ఉచిత విద్యుత్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో కూడా సన్నాలము బోనస్ కొనసాగుతోందని తెలిపారు.