నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి…. కీలక ప్రకటన చేశారు. త్వరలో అన్ని గ్రూప్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు కేసులు వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారని తెలిపారు.

వారి వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలుసు అన్నారు. కోర్టులో కేసులను అధిగమించి నియామకాల ప్రక్రియ చేపడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ఉన్న అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు అన్నారు. నీళ్ల కోసం ఖర్చు చేద్దామంటే నిధుల కొరత ఉంది… కానీ మొదటి ప్రాధాన్యతగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.