కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
అటు కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్ పై కేసు నమోదు అయింది. భవాని సేన్ గౌడ్ ను అరెస్ట్ చేసిన కాళేశ్వరం పోలీసులు.. జైలుకు తరలించారు. రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసాడు ఓ ఎస్సై. అందిన సమాచారం ప్రకారం… తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్నాడు కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు.