తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈరోజు అంటే బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలవనున్నారు. గతేడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్.. దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ సమావేశం కానున్నారు.

ఇటీవల SLBC ప్రమాదంపై మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. తాజాగా ఈ ఘటనను పూర్తిస్థాయిలో వివరించడంతో పాటు పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా… తాజాగా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి వెళ్లడం జరిగింది.