తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత R.S. ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యం అబద్దాలు ఆడే రేవంత్ రెడ్డి.. నిన్న చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు ఏం చేయలేదని.. డైట్ చార్జీలు పెంచలేదని చెప్పారు. గురుకులా ప్రతిష్టను పూర్తిగా మంటగలిపారని.. గురుకులాల రిపేర్ చేసే బాధ్యతను తీసుకున్నట్టు చెప్పారని గుర్తు చేశారు.
2023లో డైట్ చార్జీలు పెంచడానికి సబ్ కమిటీ వేశామని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తారని నిన్న రేవంత్ రెడ్డి హడావిడి చేశారు. కేటీఆర్ గురుకుల బాటకు పిలుపు ఇవ్వడం వల్లనే మంత్రులు హాస్టల్స్ బాట పట్టారు. నిన్న చిలుకూరులో రేవంత్ ముందు విద్యార్థులు కనబరిచిన ప్రతిభా పాటవాలు కేసీఆర్ హయాంలో తీసుకున్న చర్యల ఫలితమే అన్నారు R.S. ప్రవీణ్ కుమార్.