వనపర్తి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్ లో వనపర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా, ప్రతినిధులు, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తరువాత కేటీఆర్ పాలిటెక్నిక్ మైదానంలో వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పంపిణీ, మహిళలకు పంపిణీ వంటి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లబ్దిదారులు తమ ఆనందం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మెఘారెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version