ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సన్ ఫ్లవర్ గింజలను విక్రయించడానికి ఇప్పటిదాకా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహించారు. దీనివల్ల రైతులు రూ. 5,500 నుండి రూ. 6000 వరకు దళారులకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్న పరిస్థితి దాపురించిందని మండిపడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
ఇప్పటిదాకా కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దళారులకు విక్రయించడం వల్ల క్వింటాల్ కు రూ. 1000 నుండి రూ. 2000 వరకు నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి రైతులకు కలిగిందని వెల్లడించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నానని స్పష్టం చేశారు హరీష్ రావు.