భారతీయ జనతా పార్టీ ఎంపీ డీకే అరుణతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తన అనుమానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు డీకే అరుణ.

ఇక ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, డీకే అరుణ ఇంటికి భద్రత పెంచాలని పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.