ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. అవుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఉ.11 గంటలకు బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందట సీఎం రేవంత్ రెడ్డి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై పార్టి నేతలతో చర్చించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇక అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 15వ తేదీ లోపు అకౌంట్లోకి డబ్బులు కూడా రాబోతున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో… ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఊపందుకుంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తొలి విడతలో 71, 482 ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. దాదాపు 700 మంది నిర్మాణం కూడా ప్రారంభించారని లెక్కలు చెబుతున్నాయి.