నేడు సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

-

నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం తిరుమలగిరి బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ జరుగనుంది.

ration card revanth
ration card revanth

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 11 మంది లబ్ధిదారులకు కార్డులు అందించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3.58 కార్డులను పేదలకు అందించబోతున్నారు. కొత్త కార్డులతో కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలకు పైగా చేరనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news