సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 455 మందిని గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
మొత్తం 9,355 మంది జెపిఎస్ లలో 6,603 మందిని గ్రేడ్-4గా క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించింది. ఇందులో గత డిసెంబర్ 31 నాటికి 4,007 మందిని క్రమబద్ధీకరించింది. తాజాగా మరో 455 మందిని ఈ జాబితాలో చేర్చింది. మిగిలిన వారిని వచ్చే అక్టోబర్ నాటికి అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉంది.
కాగా, రూ.500కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల ఎంపికకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉచిత విద్యుత్ కోసం ఇంటి యజమాని ఆధార్, రేషన్ కార్డులు, ఇతర వివరాలను విద్యుత్ శాఖ ఎంట్రీ చేయనుంది. అటు గ్యాస్ బుక్ చేసినప్పుడు డెలివరీ బాయ్ లబ్ధిదారుల నుంచి ఆధార్, రేషన్ నంబర్లు తీసుకుంటారు. ఏటా 6 సిలిండర్లు రూ. 500 చొప్పున సరాఫరా చేయాలనే ప్రభుత్వం భావిస్తోంది.