మహిళా సంఘాలకు సీఎం రేవంత్ శుభవార్త..ఏకంగా 150 అద్దె బస్సులు ప్రారంభించనున్నారు. నేడు మరో భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారు. లక్ష మంది మహిళలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహించనున్నాను. ఇందిరా మహిళా శక్తి మిషన్-2025ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 అద్దె బస్సులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఇక ఈ సభ పూర్తి కాగానే.. ఢిల్లీ వెళతారు సీఎం రేవంత్ రెడ్డి.