పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. మరోసారి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీని తిట్టే వ్యక్తి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చాడని వ్యాఖ్యలు చేశారు. వీడియోలు మార్ఫింగ్ చేశారని చెప్తున్న మహిపాల్ రెడ్డిపై మండిపడుతున్నారు అసలు సిసలు కాంగ్రెస్ పార్టీ నేతలు.

పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై మీనాక్షి నటరాజన్ కు కూడా ఫిర్యాదు చేశారట. కాగా, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. కాంగ్రెస్ అదొక లౌ*ల పార్టీ! అంటూ రెచ్చిపోయారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తాజాగా ప్యారా నగర్ డంప్ యార్డ్ విషయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలవడానికి భాదితులు వచ్చారు. ఈ నేపథ్యంలో… కాంగ్రెస్ పై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.