పోలీసులకు బీఆర్ఎస్ నాయకుడు, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 3 రంగుల యూనిఫాం కుట్టించుకోండి అంటూ హెచ్చ్రించారు గులాబీ పార్టీ మాజీ ఎమ్యెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.
మర్రి చారిటబుల్ ట్రస్టులో నేను స్కూల్ కట్టిస్తే, ప్రారంభోత్సవానికి నన్ను పిలవలేదు. ఎంజేఆర్ పేరుపై పెయింట్ వేసి స్కూల్ ఓపెనింగ్ చేశారన్నారు బీఆర్ఎస్ నాయకుడు, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. ఎమ్మెల్సీ నిధులతో బెంచీలు ఇస్తే దానికి కుచుకుళ్ల దామోదర్ రెడ్డి పేరు వేపించుకున్నాడు.. మా సొంత డబ్బుతో స్కూల్ కట్టిస్టే మా ట్రస్ట్ పేరు పెట్టిస్తే దాని మీద పెయింట్ వేశారన్నారు.
నేనే మీలా చేయాలంటే కుచుకుళ్ల దామోదర్ రెడ్డి భార్య కుచుకుళ్ల సౌభాగ్యమ్మ పేరు ఉన్న భవనాలకు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెయింట్ వేయించే వాడిని గాని అది నా సంస్కారం కాదని ఫైర్ అయ్యారు. పోలీసులు నీతిగా పని చెయ్యండి లేదంటే మూడు రంగుల యూనిఫాం కుట్టించుకొని వేసుకోండని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకుడు, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.