తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇంజినీరింగ్ సహా బైపీసీ నుంచి ఫార్మసీ కోర్సులకు వెళ్లే వారికి సీట్ల కేటాయింపు జరగనుంది. తొలివిడత ప్రక్రియలో జులై 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన.. జులై 8వ తేదీ నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక జులై 19న తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు.
జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమై జులై 27న సర్టిఫికెట్ వెరిఫికేషన్ , జులై 27,28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి కానుంది. ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి…9న సర్టిఫికెట్ వెరిఫికేషన్, అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. ఆగస్టు 13న మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తిచేస్తారు. కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్‌కి ఆగస్టు 21, 22 తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు 26న సీట్ల కేటాయింపు చేయనున్నారు.