నల్గొండ జిల్లాకు భారీగా నిధులు కేటాయించిన కాంగ్రెస్‌ సర్కార్‌ !

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నల్గొండ జిల్లా రోడ్లకు మహర్ధశ పడుతున్నది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖలో తొలి మంజూరీ నల్గొండ జిల్లాకే దక్కింది. దీంతో జిల్లాలోని రోడ్ల రూపరేఖలు మారిపోనున్నాయి. మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేసిన 100 కోట్ల విలువైన ఈ నాలుగు రహదారుల విస్తరణ ప్రతిపాదనలకు ఈ రోజు ప్రభుత్వం పరిపాలన అనుమతులిస్తూ జీ.ఓ.ఆర్టీ నెం-22 ను విడుదల చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సంప్రదింపులు జరిపి ఈ పనులను వేగంగా మంజూరీ చేయించారు.

congress

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నాలుగు ప్రతిపాదిత రహదారులపై నల్గొండ జిల్లా ప్రజలు నిత్యం నరకం చూసినప్పటికి గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించకోలేదు. జిల్లా ప్రజలు, పత్రికలు, టీవీ ఛానెళ్లు ఈ రోడ్ల దుస్థితి గురించి కొన్ని వందలసార్లు తెలియజేసే ప్రయత్నం చేసినా కనీస స్పందన కరువయ్యింది. ఎందరో యువకులు ఈ రహదారులపై ప్రమాదాల్లో చనిపోతుంటే నా మనసు చలించిపోయిందని ఇదే విషయం గౌరవ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగారికి వివరించి.. కాంగ్రెస్ పార్టీని ఆదరించిన నల్గొండ జిల్లా ప్రజల రుణం తీర్చుకుందామనే సదుద్దేశంతో ఈ నాలుగు రోడ్లను నెల రోజుల్లో మంజూరీ చేయించినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version