ఓట్ల కోసం రాజీపడి నీచ రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ : ఈటల రాజేందర్

-

ఓట్ల కోసం రాజీపడి నీచ రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా  లింగోజిగూడ మాధవరం సేరేనిటీ అపార్ట్మెంట్ వాసులతో  ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో బాంబుపేలుళ్లతో అమాయకులు చనిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే కుక్కల్ని కొట్టినట్టు కొట్టి చంపండి అన్న రేవంత్.. ఇప్పుడు దానం నాగేందర్ కు టికెట్ ఎలా ఇచ్చారు ? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ఎమ్మెల్యేల జంపింగ్ మీద మేనిఫెస్టోలో పెడతారు.. దానికి విరుద్ధంగా రేవంత్ వ్యవహరిస్తారు. ఇది కాదా రెండు నాల్కల ధోరణి.మన విశ్వాసం గౌరవించని పార్టీలని మనం ఆదరిద్దామా ?
ఇంత టెక్నాలజీ ఉన్నా కరోనా సమయంలో మళ్ళీ మన విశ్వాసాలనే నమ్ముకున్నాం. అక్షింతలు పంపితే కడుపు నిండుతుందా అని కేసీఆర్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడకూడదు అనే సోయి ఉండాలి. రేవంత్ రెడ్డి అయిన దాంట్లో కానీ దాంట్లో ఏలు పెడుతున్నారు. EWS రిజర్వేషన్ కలిపించిన, ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తా అని చెప్పిన మోడీ గారి గురించా మీరు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అని మాట్లాడుతున్నారు అంటే నాలుకకు నరం ఉందా ? ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా ? EWS రిజర్వేషన్ రద్దు చేయాలని రేవంత్ అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు ఇస్తే.. నరేంద్రమోడీ గారు 16 ఎయిమ్స్ ఆసుపత్రులు నెలకొల్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version