కంటోన్మెంట్ పోటీ పై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ సెగ్మెంట్ కి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే బీఆర్ఎస్ నుంచి సాయన్న కుటుంబ సభ్యులే పోటీలోకి దిగితే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలపెట్టకూడదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏకగ్రీవంగా వారి కుటుంబం నుంచే ఎంపిక చేయాలని కాంగ్రెస్ కీలక నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సాయన్న ఫ్యామిలీని కాదని.. ఇతరులను పోటీలో దించితే మాత్రం దివంగత ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న బిడ్డ వెన్నెలనే పోటీలో ఉంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ స్వల్ప కారణాలతో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితులు అన్నింటిపై ఢిల్లీ హై కమాండ్ కు టీపీసీసీ లేఖ రాయనున్నది. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే ఉప ఎన్నికలు, అభ్యర్థిత్వం పై తదుపరి నిర్నయం తీసుకోవాలని పార్టీ భావిస్తుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరణించినా.. సాయన్న ఫ్యామిలీ పై ఉన్న సానుభూతితోనే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version