నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం

-

నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాలు -1లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వస్తున్న తరుణంలోనే… ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారట.

Congress LP meeting chaired by CM Revanth Reddy today

ఇది ఇలా ఉండగా…. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 19వ తేదీన బడ్జెట్‌ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news