SLBC Tunnel Collapse Update: టన్నెల్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న ఆ 8 మంది కార్మికులు చనిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ.

టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో భాగంగా.. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సాయంతో మూడు మీటర్ల లోతులో.. కార్మికుల మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించిందని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ. మృతదేహాలను వెలికి తీశాక పోస్టుమార్టం చేస్తామని తెలిపారు వంశీకృష్ణ.