కేదార్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేదార్ మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దుబాయ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు…అంటూ కిషన్ రెడ్డికి చామల లేఖ రాశారు. దుబాయ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కేదార్ మృతి మీద విచారణ చేయండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

కేదార్ మృతి మీద విచారణ చేయండని.. కేంద్రం దీనిపై దృష్టిలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే… కేదార్ మృతిపై ఓ క్లారిటీ వచ్చింది. కేదార్ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిన దుబాయ్ పోలీసులు… కేదార్ ది సహజ మరణమే అని తేల్చారు. కేదార్ భార్య రేఖా వీణకు మృతదేహాన్ని అప్పగించారు దుబాయ్ పోలీసులు. భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు. దుబాయ్ లోని కేదార్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు భార్య కుటుంబ సభ్యులు.