వరంగల్లో తీవ్ర ఉద్రిక్తత.. సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మామునూరులో కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర పోర్టు కింద భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు.

ఎయిర్ పోర్టు కింద కోల్పోయిన భూములకు పరిహారంగా డబ్బులు కాకుండా భూములే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే నిర్వహిస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమకు ముందు భూ పరిహారం ఇప్పించాకే పనులు ప్రారంభించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news