చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం సంఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజక వర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు దుండగులు.. ఈ రోజు చండూర్ మండలం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారు దుండగులు.
అయితే.. ఈ చర్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెటినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. బీజేపీ లకు వణుకు పుట్టింది.. మునుగోడు లో కాంగ్రెస్ కి వస్తున్న ఆధారన చూసి ఓర్వలేక పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. Trs.. బీజేపీ కుమ్మక్కు అయ్యి మా క్యాడర్ ని బెదిరిచే కుట్ర చేస్తున్నారని.. బెదిరిస్తే బెదిరేది లేదని హెచ్చరించారు. పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే sp కార్యాలయం ముందు నేనే ధర్నా చేస్తానని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
గోడల మీద పేర్లు చెరుపుడు, పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేసుడు ఏమి రా RG పాల్ ఓటమి భయం గట్టిగానే పట్టుకుంది నికు. ఇసొంటి కథలు ఎన్ని పడ్డా మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.#Munugodugaddacongressadda pic.twitter.com/dwFIAwemT9
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) October 11, 2022